ప్రార్ధన పలుకులు | Telugu Christian Illustrations
ప్రార్థన పలుకులు
1.
పరలోకపు శక్తిని
దింపగలిగిన భూలోకపు శక్తి ప్రార్ధన మాత్రమే – ఆండ్రూ ముర్రే
2.
వ్యక్తిగతంగా
ఎక్కువ సేపు ప్రార్ధించుకొనే వారు బహిరంగంగా క్లుప్త ప్రార్థనలు చేస్తారు – ఇ.యం. బౌండ్స్
3.
బాగా
ప్రార్ధించగలిగినవాడే, బాగా చదువుకున్నవాడు – మార్టిన్ లూథర్
4.
ప్రార్థన పాపం
చేయకుండా ఆపుతుంది. ఆ విధంగానే పాపం, ప్రార్ధన
చేయకుండా ఆపుతుంది – జాన్ బన్యన్
5.
ప్రార్థనలో మనం
ఏం చెబుతామన్నది ముఖ్యం కాదు, దేవుడు మనతో ఏం చెబుతాడన్నది ముఖ్యం – మదర్ థెరిస్సా
6.
ప్రార్థన ఊపిరి
వంటిది. ఊపిరాడక పోతే మనిషి చనిపోతాడు. ప్రార్ధన చేయకపోతే క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడు – సాధు సుందర్ సింగ్
7.
ఉదయం ఒక అరగంట
దేవునితో సంభాషిస్తే, రాత్రి ఒక గంట ఒప్పుకోవటం తప్పుతుంది – ఒక ప్రార్థనా వీరుడు
8.
ప్రార్థనలో
గడిపిన ఒక రాత్రి చాలు, మనల్ని నూతన పరచడానికి, ఆత్మ దారిద్య్రం నుండి ఆధ్యాత్మిక
సిరులలోనికి, భయం నుండి ఆనందంలోనికి నడిపించడానికి – ఛార్లెస్ స్పర్జన్
9.
రెండు చేతులు
కలిసి పనిచేసినట్లు భార్యా భర్తలు మనసులు కలిపి ప్రార్ధిస్తే కుటుంబం కట్టబడుతుంది – బిల్లీ గ్రహం
10.
తన పిల్లలకు
ప్రార్ధన నేర్పించే తల్లికంటే ఉత్తమ స్త్రీ లేదు – విన్ రోడ్
11.
ప్రార్థించే
సంఘాలు, ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చేస్తాయి – ఇ.యం. బౌండ్స్
12.
దేవుని దీవెన
అడక్కుండా గుక్కెడు మంచినీళ్ళు కూడా నా గొంతులోకి పోనియ్యను - ఎస్. జాక్సన్
13.
హృదయం నుండి
సైతానును పారద్రోలి దేవునికి నివాసం కలిగిస్తుంది ప్రార్థన - డా॥పెయిన్
14.
ఊహించలేనివాటిని
ప్రార్ధనతో సాధించవచ్చు – టిన్నిసన్
15.
కన్నీటితో కడిగిన
ముఖం దేవునికి చాలా అందంగా కనిపిస్తుంది- రేంజ్లా గామ్
16.
సైతాను మన వ్యర్ధ
ప్రయత్నాలు చూచి నవ్వుతాడు. మన జ్ఞానాన్ని చూచి వెక్కిరిస్తాడు. కానీ మనం ప్రార్థించినప్పుడు వణికిపోతాడు – సామ్యూల్ కెడ్విక్ డేవిడ్ దండల
Comments
Post a Comment