యాచకుడు | Telugu Christian Illustrations
యాచకుడు
ఆయన వారితో "మీరు ఏవిధమైన లోభమునకు
చోటియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి
విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు"
అనెను (లూకా 12:15).
పాస్టర్ ఇమ్మానుయేలు గారి దగ్గరకు పారిశ్రామికవేత్త
అయిన ప్రసాదు వచ్చాడు. “పాస్టరు గారూ! నా
వ్యాపారాలు బాగుగా అభివృద్ధి
చెందాలని ప్రార్ధన చేయండి” అంటూ 10 వేల రూపాయలు పాస్టరు
గారికి
అందించాడు. పాస్టరు గారు ఆ డబ్బు తీసుకొని
"మీ వద్ద ఇంకా ధనం ఉన్నదా?” అని అడిగారు.
“ఉన్నదండీ” అన్నాడు ప్రసాదు.
"మీకు ఇంకా ధనం కావాలని ఆశ ఉన్నదా?”
“అవునండీ” అన్నాడు ప్రసాదు.
అప్పుడు ఇమ్మానుయేలు గారు “అయితే ఈ 10 వేలు మీ దగ్గరే ఉంచండి. మీరు నాకంటే ఎక్కువ అవసరం కలిగి యున్నారు. నా వద్ద డబ్బు ఏమీ లేదు. అయినా కావాలనే కోరికా లేదు. నీ వద్ద చాలా డబ్బు
ఉంది. అయినా ఇంకా
చాలా కావాలని ఆశ ఉంది.
అందువల్ల ఇది నీ వద్ద ఉంటేనే మంచిది" అంటూ ప్రసాదు ఇచ్చిన 10 వేలు తిరిగి ఇచ్చేసారు.
డా॥ పి.బి.మనోహర్
Comments
Post a Comment