థామస్ ఆల్వా ఎడిసన్ | Telugu Christian Illustrations

థామస్ ఆల్వా ఎడిసన్

థామస్ ఆల్వా ఎడిసన్

పేద తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివిన చాలా, చాలా విశేషాల్లో ఇది ఒకటి.

ఒక రోజు, థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాసు మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాస్ టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నాడు, ఇంకెవరికీ ఇవ్వ వద్దని మరీ మరీ చెప్పాడు అని కూడా చెప్పాడు.

ఆమె ఆ ఉత్తరాన్ని లోలోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కన్నీటిపర్యంతమయ్యింది. ఆత్రుత పడిన ఎడిసన్ అమ్మా అందులో ఏం రాసుందీ అని ఉత్సుకతగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణగా ఉందా..! అని కూడా అడిగాడు. అయితే, ఆ పేద తల్లి ఏమీ లేదు నాయనా....! గట్టిగా చదువుతాను నువ్వూ విను....! అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది.

"అమ్మా మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి."

ఇది విని ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోయింది. ఆనంద పడ్డాడు. ఆ తరవాత చాలాకాలం గడిసింది. ఎడిసన్ తల్లి మరణించింది. కాలం గడిచింది ఎడిసన్ ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకడు అయ్యాడు.

అప్పుడు ఒక రోజు, అతను పాత ఇంటి సామానులన్నింటినీ సర్దిస్తూ....! అతని తల్లికి సంబందించిన బల్ల డెస్క్‌లోని డ్రాయర్ మూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన మడత కాగితాన్ని కనుగొన్నాడు. అతను దానిని గుర్తు చేసుకుని తెరిసి మళ్లీ చదవాలనుకున్నాడు....! తెరిసి చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది.

"అమ్మా మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు. ఇతని మెదడు దేనినైనా చాలా నెమ్మదిగానే అర్ధం చేసుకోగడు. మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరి సమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్పా వేరొకటీ కాదు. ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏ విజయాన్నీ సాధించలేరు. అందు చేత మేము అతన్ని ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము."

ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొన్ని గంటలు రొమ్ములు గుద్దుకుంటూ అరిచాడు, ఏడ్చాడు...! రోధనతో విల విల్లాడాడు. ఉపశమనం తరవాత తేరుకుని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు:

"థామస్ అల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ పిల్లవాడు, గొప్ప హీరోలాంటి తల్లి చేత, శతాబ్దపు మేధావి అయ్యాడు"

ఎడిసన్ నమ్మాడు తల్లిని, తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు, అందుకే అంత తీవ్రమైన ఉత్తరం కూడా అతన్ని విజయుడిని చేసింది...

Comments

Popular posts from this blog

తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ – దేవుని క్షమాపణ | Telugu Christian Sermons

దేవుని విశ్వాస్యత – Faithfulness of God | Telugu Christian Sermons

Keep Faith in the Last Days | Christian Sermons