జారవిడచుకొనుట | Telugu Christian Illustrations

జారవిడచుకొనుట

ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము? (హెబ్రీ. 2:3).

అమెరికాలోని పెన్సిల్వానియా రాష్ట్రమునకు పొల్లాక్ (Pollock) గవర్నర్గా ఉన్నప్పుడు ఎడ్వర్డ్ అను ఒక వ్యక్తి హత్యా నేరముపై ఖైదు చేయబడ్డాడు. కోర్టులో అతని నేరము నిరూపణ అయినందువలన అతనికి ఉరి శిక్ష విధించారు. పొల్లాక్ గారు మంచి క్రైస్తవుడు. ఎడ్వర్డ్ను క్షమాభిక్ష ప్రసాదించమని అనేకులు పొల్లాక్ గారిని కోరారు. పొల్లాక్ గారు చట్ట ప్రకారము కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని ఈ కోర్టు ఇచ్చిన తీర్పు విషయములో తాను జోక్యము చేసుకొనననీ సున్నితంగా తిరస్కరించారు.

ఎడ్వర్డ్కు ఉరి శిక్ష పడినందువల్ల క్రైస్తవుడు అయిన పొల్లాక్ గారు అతనికి సువార్తను ప్రకటించాలని ఆశించారు. అందువల్ల తానే స్వయంగా జైలుకు వెళ్లి ఎడ్వర్డ్ ప్రక్కనే కూర్చుండి సువార్తను చెప్పారు. ఈ లోక న్యాయమూర్తులు మరణశిక్ష విధించిననూ పరలోక న్యాయమూర్తిని శరణు జొచ్చినచో నిత్య రక్షణను అనుగ్రహించునని ఎంతో ఓపికగాసౌమ్యంగా అతనికి నచ్చజెప్పారు.

ఎడ్వర్డ్ కన్నీరు విడుస్తూ తన పాపములను క్షమించమని ప్రభువును వేడుకొన్నాడు. పొల్లాక్ గారు వెళ్లిపోయిన తరువాత ఎడ్వర్డ్ కాపలాదారుని పిలిచి "ఇప్పటి వరకు నాతో ఇంత సౌమ్యంగా మాట్లాడినది ఎవరుఏ చర్చి పాస్టరు?" అని ప్రశ్నించాడు. అందుకు జైలు వార్డెన్ "ఆయన ఈ రాష్ట్రానికి గవర్నర్ అయిన పొల్లాక్ గారు" అన్నాడు. ఎడ్వర్డ్ స్థాణువులా నిలబడ్డాడు.

ఆ షాక్ నుండి ఐదు నిమిషాల వరకు తేరుకో లేదు. "వార్డెన్ గారూ! వచ్చిన వ్యక్తి గవర్నర్ గారని నాకు ముందే ఎందుకు చెప్పలేదునేను ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ కోరి ఉండేవాడిని. విడుదల పత్రము ఇచ్చేటంత వరకు బ్రతిమాలేవాడిని. అయన గవర్నర్ అని నాకు తెలియ లేదు" అని ఎలుగెత్తి ఏడ్చాడు.

గవర్నర్ కంటే గొప్పవాడైన యేసు ప్రభువు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మన నిమిత్తము ప్రాణము ఇచ్చినవారు. పాపమునే జైలు నుండి మిమ్ములను విడిపించుటకు సిద్ధముగా ఉన్నారు. మీరు ఆయన శరణు జొచ్చితే చాలును.

– డాII పి. బి. మనోహర్


Comments

Popular posts from this blog

నిజమైన స్నేహం — దావీదు మరియు యోనాతాను | Sunday School Stories

థామస్ ఆల్వా ఎడిసన్ | Telugu Christian Illustrations

తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ – దేవుని క్షమాపణ | Telugu Christian Sermons