Posts

నిజమైన స్నేహం — దావీదు మరియు యోనాతాను | Sunday School Stories

Image
🌿 నిజమైన స్నేహం — దావీదు & యోనాతాను “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును.” — సామెతలు 17:17 ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు దావీదు . అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ, దేవుడు అతన్ని గొప్ప రాజుగా చేయాలని యోచించారు . అప్పుడు రాజు సౌలు మరియు అతని కుమారుడు యోనాతాను ఉండేవారు. యోనాతాను ధైర్యవంతుడు, మంచి హృదయం కలవాడు. 🌟 స్నేహం మొదలు ఒక రోజు దావీదు గొల్యాతు అనే రాక్షసుడిని ఓడించాడు . అందరూ దావీదును ప్రశంసించారు. అప్పుడు యోనాతాను దావీదుపై ప్రేమ మరియు గౌరవంతో నిండిపోయాడు . వారు అసలు స్నేహితులయ్యారు . యోనాతాను ఇచ్చిన బహుమతులు: తన వస్త్రం తన విల్లు తన ఖడ్గం ఇది అతని నిజమైన ప్రేమకు గుర్తుగా ఉంది. ⚔️ విషమ పరిస్థితులు రాజు సౌలు అసూయతో నిండిపోయాడు మరియు దావీదును చంపాలని యత్నించాడు. కానీ యోనాతాను తన తండ్రి కోపం గురించి ముందుగానే దావీదుకు హెచ్చరిక ఇచ్చి 🤝 స్నేహ నిబంధన దావీదు మరియు యోనాతాను ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు: “యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ...

తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ – దేవుని క్షమాపణ | Telugu Christian Sermons

✨ తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ – దేవుని క్షమాపణ ✝️ 📖 పరిచయం ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మనం దేవుని దూరం చేసుకుని మన స్వంత ఇష్టాల ప్రకారం నడుస్తాము. కానీ దేవుని ప్రేమ, క్షమ మనల్ని తిరిగి ఆయన వైపు తీసుకువస్తుంది. బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలోని “తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ” ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. 🕊️ కథ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారిలో చిన్నవాడు తన వాటా తీసుకొని దూర దేశానికి వెళ్లిపోయాడు. అక్కడ తన ఆస్తిని వ్యర్థంగా ఖర్చు చేశాడు. డబ్బు అయిపోయినప్పుడు అతడు దారిద్య్రం అనుభవించాడు. పనికోసం పందుల కాపరిగా మారి ఆహారం కూడా దొరకని పరిస్థితికి చేరుకున్నాడు. “నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లి ఆయనను క్షమాపణ కోరతాను.” కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దూరం నుండి అతన్ని చూసిన తండ్రి ప్రేమతో పరుగెత్తి ...

థామస్ ఆల్వా ఎడిసన్ | Telugu Christian Illustrations

థామస్ ఆల్వా ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్ పేద తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివిన చాలా, చాలా విశేషాల్లో ఇది ఒకటి. ఒక రోజు, థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాసు మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాస్ టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నాడు, ఇంకెవరికీ ఇవ్వ వద్దని మరీ మరీ చెప్పాడు అని కూడా చెప్పాడు. ఆమె ఆ ఉత్తరాన్ని లోలోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కన్నీటిపర్యంతమయ్యింది. ఆత్రుత పడిన ఎడిసన్ అమ్మా అందులో ఏం రాసుందీ అని ఉత్సుకతగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణగా ఉందా..! అని కూడా అడిగాడు. అయితే, ఆ పేద తల్లి ఏమీ లేదు నాయనా....! గట్టిగా చదువుతాను నువ్వూ విను....! అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది. "అమ్మా మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి." ఇది విని ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోయింది. ఆనంద పడ్డాడు. ఆ తరవాత చాలాకాలం గడిసింది. ఎడిసన్ తల్లి మరణించింది....

దయ్యము పట్టినవాడు | Telugu Christian Illustrations

దయ్యము పట్టినవాడు   అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను ; వాడు వెళ్లి దేవుడు వానికెట్టి  గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను (లూకా 8:39) , గెరాసేనుల దేశములో దయ్యము పట్టినవాడు యేసు ప్రభువును ఎదుర్కొన్నాడు. అతడు దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరుగుతూ సమాధులలో నివసించేవాడు. యేసు ప్రభువు అతనిని స్వస్థపరచిన తరువాత "నేను కూడ మీతో వస్తాను ప్రభువా!" అని బ్రతిమాలాడు. కానీ యేసు ప్రభువు "నీవు ఇక్కడే ఉండి దేవుడు నీ యెడల చేసిన కార్యముల గురించి ఇతరులకు వివరించి చెప్పు" అని ఆజ్ఞాపించారు. అతడు లేచి తన ఇంటివైపు నడక సాగించాడు. కిటికీ నుండి అతని పిల్లలు అతని చూసారు. "అమ్మా! నాన్న వస్తున్నాడు" అని అరిచారు. ఆమె కంగారుగా “తలుపు మూయండి. కిటికీలు అన్నీ మూసివేయండి" అని అరిచింది. పిల్లలందరూ తలుపులు మూసివేసారు. పోయినసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు విరుగగొట్టాడు. పెంచుకొంటున్న పూల మొక్కలన్నిటినీ పెరికి పారవేసాడు. పిల్లలు భయంగా చూస్తూ ఉండగా తల్లిని జుట్టు పట్టుకొని...

ఆయనే చెప్పారు! | Telugu Christian Illustrations

  ఆయనే చెప్పారు! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను (యోహాను 3:16). నెపోలియన్ తన గుర్రమును అధిరోహించి సైన్యమును పరిశీలిస్తున్నాడు. అకస్మాత్తుగా అయన గుర్రము బెదిరి వెనుక కాళ్ళ మీదకు లేచింది. నెపోలియన్ చేతిలోని కళ్ళెము జారిపోయినది. గుర్రము పరుగు తీయుట ప్రారంభించింది. నెపోలియన్ పరిస్థితి చాల ప్రమాదంగా ఉన్నది. ఒక సైనికుడు అది చూచాడు. అతడు వేగంగా పరుగెత్తి గుర్రపు కళ్ళెము పట్టుకొని గుర్రము ఆపాడు. అది చాల ప్రమాదముతో కూడుకొన్న పని. గుర్రము అతనిని త్రొక్కవచ్చును. అయినా అతడు తెగించి గుర్రమును ఆపాడు. నెపోలియన్ సంతోషించి "ఈ రోజు నుండి నిన్ను శతాధిపతిని చేస్తున్నాను" అన్నాడు. అ సైనికుడు వెంటనే నెపోలియన్కు సెల్యూట్ చేసి శతాధిపతులు కూర్చుండే స్థలమునకు వెళ్లాడు. అతని దళపతి "శతాధిపతులు కూర్చుండే చోటికి నీవు ఎందుకు వెళుతున్నావు ? దళపతినైన నాకే అక్కడికి వెళ్లే అధికారము లేదు. నీవు వచ్చి ఇక్కడ లైనులో నిలబడు" అని అరిచాడు. ఆ సైనికుడు "నేను అక్కడిక...

జారవిడచుకొనుట | Telugu Christian Illustrations

జారవిడచుకొనుట ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము ? ( హెబ్రీ . 2:3). అమెరికాలోని పెన్సిల్వానియా రాష్ట్రమునకు పొల్లాక్ ( Pollock)  గవర్నర్గా ఉన్నప్పుడు   ఎడ్వర్డ్ అను ఒక వ్యక్తి హత్యా నేరముపై ఖైదు చేయబడ్డాడు. కోర్టులో అతని నేరము   నిరూపణ అయినందువలన అతనికి ఉరి శిక్ష విధించారు. పొల్లాక్ గారు మంచి క్రైస్తవుడు.   ఎడ్వర్డ్ను క్షమాభిక్ష ప్రసాదించమని అనేకులు పొల్లాక్ గారిని కోరారు. పొల్లాక్ గారు   చట్ట ప్రకారము కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని ఈ కోర్టు ఇచ్చిన తీర్పు   విషయములో తాను జోక్యము చేసుకొనననీ సున్నితంగా తిరస్కరించారు. ఎడ్వర్డ్కు ఉరి శిక్ష పడినందువల్ల క్రైస్తవుడు అయిన పొల్లాక్ గారు అతనికి సువార్తను   ప్రకటించాలని ఆశించారు. అందువల్ల తానే స్వయంగా జైలుకు వెళ్లి ఎడ్వర్డ్ ప్రక్కనే   కూర్చుండి సువార్తను చెప్పారు. ఈ లోక న్యాయమూర్తులు మరణశిక్ష విధించిననూ   పరలోక న్యాయమూర్తిని శరణు జొచ్చినచో నిత్య రక్షణను అనుగ్రహించునని ఎంతో   ఓపికగా ,  సౌమ్యంగా అతనికి నచ్చజెప్పారు. ఎడ్వర్డ్ కన్నీరు విడుస్తూ తన పాప...

ఆత్మల పట్ల భారము | Telugu Christian Illustrations

ఆత్మల పట్ల భారము నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపక "పోయిన యెడల నాకు శ్రమ (1కొరింథీ 9:16). ఫెడ్రిక్ గారు 1867లో మన దేశంలో సువార్త ప్రకటించుటకు ఇంగ్లాండ్ నుండి వచ్చారు. ఆరోగ్యము క్షీణించినందువల్ల విశ్రాంతి కొరకు తిరిగి ఇంగ్లాండ్ వెళ్లారు. ఎడిన్బరోలో జూన్ మాసంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుటకు ఆయనను ఆహ్వానించారు. ఎంతో అనారోగ్యముగా ఉన్ననూ ఆయన ఓపిక తెచ్చుకొని ఆ సభకు  హాజరయ్యారు. తన గురించి , తన సేవ గురించి క్లుప్తంగా మాట్లాడి భారత దేశంలో సువార్త అవశ్యకత గురించి అక్కడ ఉన్న పాస్టర్లకు వివరించి తమ సంఘముల నుండి మిషనెరీలను పంపవలసినదని విజ్ఞప్తి చేసారు. ఆయన ఇంకా మాట్లాడు చుండగానే నీరసము వలన స్పృహతప్పి పడిపోయారు. ఆయన స్నేహితులు ఆయనను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యము చేయించారు. అయన స్పృహలోనికి రాగానే "నేను ఎక్కడ ఉన్నాను ?" అని అడిగారు. ఆయన స్నేహితులు "నీవు మాట్లాడు చుండగా నీరసము వలన స్పృహతప్పి పడిపోయావు. అందువలన డాక్టర్ వద్దకు తీసుకొని వచ్చాము" అ...